హైదరాబాద్: మాజీ ఎంపి వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్‌కు హైకోర్టు ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనదని హైకోర్టు అవినాష్ కు సూచించింది. కీలక సాక్షి స్టేట్‌మెంట్‌ను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు సిబిఐ సమర్పించింది. ఎబిఎన్, మహాటివి ఛానళ్లలో 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసి తెలంగాణ హైకోర్టు సిజెకి అందించాలని ఆదేశించింది. టివి చర్చల్లో పాల్గొన్న సస్పెండైన జడ్జికి డబ్బు సంచులు వెళ్లాయని చేసిన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.
షరతులతో అవినాష్‌కు బెయిల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -