- Advertisement -
అమరావతి: పోలవరం ఎత్తును కుదించడంలో చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించిందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీపడ్డారని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 25 వేల కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారని ధ్వజమెత్తారు. పోలవరం ఎత్తు, కెపాసిటీని తగ్గించి బాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 30 వేల కోట్లకే పరిమితం చేశారని, 16 మంది ఎంపిలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం లేదని విమర్శలు గుప్పించారు. కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ ను తీసుకొస్తే, చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని బాధను వ్యక్తం చేశారు. బాబు చర్యలతో యువత, రైతులు నష్టపోతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -