Sunday, December 22, 2024

చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిశారు. ఇటీవల తండ్రి అస్వస్థతకు గురైన నేప థ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు జైలు అధికారులు అవినాష్‌రెడ్డికి అనుమతి ఇచ్చారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే పలుమార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవలే న్యాయస్థానం అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News