Saturday, November 9, 2024

వివేకా రాసిన ఆ లేఖ ఎందుకు దాచారు: అవినాశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివేకా హత్య కేసుపై కడప ఎంపి అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివ ప్రకాశ్ రెడ్డి తనకు చెప్పారని, తాను అప్పటికే జమ్మల మడుగుకు వెళ్తున్నానని వివరించారు. తాను పులివెందుల రింగ్‌రోడ్డు దగ్గరున్నప్పుడు తనకు కాల్ వచ్చిందని, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా? అని అడిగానని చెప్పారు. తాను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచేశారని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా లేఖ రాశారని, లేఖ, సెల్‌ఫోన్ దాచామని రాజశేఖర్ రెడ్డి తనకు చెప్పారని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో ఆ లెటరే కీలకంగా మారిందన్నారు.

Also Read: మేకలు కాసున్న బాలుడిని ఢీకొట్టి…. పారిపోయారు

అలాంటి లేఖను ఎందుకు దాచారని అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన సమాధానం హాస్యాస్పదంగా ఉందన్నారు. లెటర్‌లో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశారని వివేకా రాశారని, డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్‌పై దాడి చేస్తారనే లేఖ దాచామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారని వివరించారు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్‌నే నమ్ముతారా? అని సునీతను ప్రశ్నించారు. ఆ లెటర్‌పై సిబిఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదని అవినాశ్ అడిగారు. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని? నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News