Thursday, January 23, 2025

సుప్రీంకోర్టులో ఎంపి అవినాష్‌రెడ్డికి దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపి చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించా లని ఎంపి అవినాష్ రెడ్డి కోరగా, రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. ఎపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపి అవినాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

also Read: బుడతడిని భుజాలపై ఎత్తుకొని ఆడించిన కెటిఆర్

ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఎంపికి సిబిఐ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎంపి అవినాష్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఎంపి అవినాష్ తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. విచారణ తేదీని సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం ఖరారు చేయలేదు. అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News