ఢిల్లీ: వివేకా మర్డర్ కేసులో సునీతా రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వివేకా హత్య తరువాత సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఎంపి అవినాశ్ రెడ్డి ప్రయత్నం చేశాడని సిద్ధార్థ లూత్ర కోర్టులో వాదనలు వినిపించారు. సిఐ శంకరయ్య తన వాంగ్మూలంలో అదే చెప్పారని సునీత లాయర్ పేర్కొన్నారు.
Also Read: చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని…. పోలీసులకు ఫిర్యాదు
హైకోర్టు అలా చెప్పలేదని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ముకుల్ రోహత్గి వెల్లడించారు. వివేకా మర్డర్ కేసులో సిబిఐ క్లియర్‌గా అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని చెప్పారని సునీత లాయర్ గుర్తు చేశారు. హైకోర్టు ప్రాధమిక స్థాయిలో ఎలా జోక్యం చేసుకుంటుందని సిజెఐ ప్రశ్నించింది. సిబిఐ పని కూడా హైకోర్టు చేస్తే ఎలా అని సిజెఐ డివై చంద్రచూడ్ అడిగారు. ఈ కేసులో మాత్రమే హైకోర్టు ఎందుకు ఇలా వ్యవహరించిందని అడిగింది. ప్రశ్నోత్తరాల ప్రింటెంట్ పార్మాట్‌లో ఇవ్వాలని హైకోర్టు ఎలా చెబుతోందని సిజెఐ ప్రశ్నించింది.