Monday, January 20, 2025

ఐఐఎం విద్యార్థినికి రూ. 64.61 లక్షల జీతంతో ఉద్యోగం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సంబల్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) విద్యార్థిని అవ్నీ మలోహత్రా మైక్రోసాఫ్ట్‌లో అంత్యంత జీతం ప్యాకేజిని దక్కించుకుంది. ఆమెకు సంవత్సరానికి రూ. 64.61 లక్షల జీతంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం లభించింది. ఆమె జైపూర్‌కు చెందినది. ఆరు రౌండ్లలో ఆమె ఐదు రౌండ్ల ఇంటర్యూ పూర్తి చేసుకుంది. ఇతర విద్యార్థుల కన్నా ఆమె ముందంజలో నిలిచారు. దీనికి ముందు ఆమె మూడేళ్లపాటు ఇన్‌ఫోసిస్‌లో పనిచేశారు. కంప్యూటర్‌లో ఆమె బి.టెక్ డిగ్రీ పూర్తిచేశారు. ఆమె మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు ఆమె ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు తోడ్పడ్డారు.
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారామ్, అముల్, అదానీ, ఈవై, అక్సెంచర్, కాగ్నిజెంట్, డెల్లాయిట్, అమేజాన్ వంటి పెద్ద రిక్రూటర్లు కూడా అభ్యర్థులను రిక్రూట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News