Sunday, December 22, 2024

మీరు టీ ని ప్లాస్టిక్ కప్ లో తాగుతున్నారా.. అయితే జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాడి పారేసే పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా? అయితే మీరు మీ జీవిత ఆయుష్షును చేజేతులా విసిరి పారేసుకుంటున్నట్లే. ఈ విషయం ప్రఖ్యాత ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. డిస్పోజబుల్ పేపర్ కప్పులలో టీ అందించడం పరిపాటి అయింది. అయితే ఈ పద్థతిలో తేనీటి సేవనం ఏకంగా ప్లాస్టిక్ పదార్థాలను శరీరంలోకి చొప్పించుకోవడమే అవుతుందని అధ్యయనంలో స్పష్టం అయింది.

ఏ వ్యక్తి అయినా రోజుకు మూడు సార్లు డిస్పోజబుల్ కప్‌లలో టీ తాగితే వారి కడుపులోకి ఎంత లేదన్నా 75000 సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులు చేరుతాయి. మనిషిని ప్లాస్టిక్ విషపూరితం చేసి, ఆరోగ్యాన్ని గుల్ల చేసే ఈ ముప్పు గురించి ఐఐటి ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ తెలిపారు. ఆమె ఆధ్వర్యంలోనే దీనిపై అధ్యయనం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News