- Advertisement -
మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ఈ క్రేజీ ప్రాజెక్టుతో ఆయన కుమారుడు అవ్రామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా మూవీలోని అవ్రామ్ స్పెషల్ పోస్టర్ ను మోహన్ బాబు విడుదల చేశారు. ఇందులో తిన్నడుగా నటిస్తున్న అవ్రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అవ్రామ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం, అలీ, కాజల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపుగా మూవీ షూటీంగ్ పూర్తయింది. ఇప్పటికే విడుల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
- Advertisement -