Sunday, December 22, 2024

స్పృహలో ఉండగానే చిన్నారికి బ్రెయిన్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఎయిమ్స్ వైద్యులు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలికను మెలకువ లోనే ఉంచి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ విధంగా సర్జరీ చయడం ప్రపంచం లోనే మొదటిసారి.ఒకటో తరగతి చదువుతున్న అక్షిత మూర్ఛతో బాధపడుతుండడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడు ఎడమ భాగంలో కణుతులు ఉన్నట్టు గుర్తించారు. ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ దీపక్‌గుప్తా బృందం ఆ బాలికను స్పృహ లోనే ఉంచి సర్జరీ చేశారు. ఈ విధంగా రోగిని మెలకువగా ఉంచి సర్జరీ చేయడాన్ని అవేక్ క్రానియోటమీ అంటారు. ఇలా చేయడం ద్వారా కణుతులను పూర్తిగా తీసి వేయడంతోపాటు ,

నరాల సంబంధిత లోపాలను నివారించడానికి తోడ్పడుతుందని వైద్యులు చెప్పారు. నొప్పి కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారికి మత్తు మందు ఇవ్వడం సహా సర్జరీని మూడు గంటల్లో పూర్తి చేశారు. ఆపరేషన్ మధ్యలో మూర్ఛ రాకుండా మెదడు ఉపరితలంపై ఐస్‌కోల్డ్ స్లైన్‌ను ఉపయోగించినట్టు వైద్యులు పేర్కొన్నారు. సర్జరీ పూర్తయ్యేవరకు చిన్నారి మెలకువ లోనే ఉందని, తాము చూపిన ప్రధాని మోడీ చిత్రాన్నిగుర్తు పట్టిందని తెలిపారు . ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని , సోమవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. స్పృహలో ఉండి సర్జరీ చేయించుకున్న అతి చిన్న వయస్కు రాలిగా అక్షిత రికార్డు సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News