Sunday, January 19, 2025

జలమండలికి మరో అవార్డు

- Advertisement -
- Advertisement -

నీటి సంరక్షణ పద్దతులు, ఇంకుడు గుంతలు నిర్మాణంతో అవార్డు ఎంపిక
అవార్డు రావడం పట్ల సిబ్బందిని అభినందించిన ఎండీ దానకిషోర్

Award for Hyderabad water board
మన తెలంగాణ,సిటీబ్యూరో: జలమండలికి తెలంగాణ వాటర్ కన్జర్వేషన్ అవార్డు 2021 దక్కింది. ఉత్తమ ప్రభుత్వ,ప్రైవేటు సంస్దల కేటగిరిలో తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ అవార్డును జలమండలికి అందించింది. నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, నీటి సరంక్షణ పద్దతులను వివరిస్తూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు నిర్మించడం, ఎన్జీవోల భాగస్వామ్యంతో వాక్, జలంజీవం లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకుడుగుంతలు నిర్మించి ప్రతి ఏటా పునరుద్దరణ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డుకు ఎంపిక చేసింది.
జలమండలి కార్యాలయంలో ఎండీ దానకిషోర్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబుకు ఈ అవార్డును అందించారు. జలమండలికి అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జలమండలి అధికారులు, సిబ్బందిని అభినందించారు. అందుకు ముందు ఖైరతాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్‌రావు చేతుల మీదుగా డైరెక్టర్ శ్రీధర్‌బాబు అవార్డును అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News