మన తెలంగాణ/సిటీ బ్యూరో: మందులేని వైద్యం ఆక్యూపంక్చర్ థెరపీలో విశేష సేవలను అందిస్తున్న హీలర్, ఆక్యుపంక్చరిస్ట్ కాపర్తి జనార్ధన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భగా ఇటీవలహైదరాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ పలు రంగాలకు చెందిన వైద్యులను సన్మానించింది. ఇందులో భాగంగా ఆక్యూపంక్చర్ థేరపిలో విశే సేవలకు గాను కాపర్తి జనార్ధన్‌కు ప్రముఖ డైట్ నిపుణులు వీరమాచినేని రామకృష్ణ జలవనరుల అభివృద్ది సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ చేతుల మీదగా ‘ఆల్టర్నేటివ్ మెడిసన్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు.
అల్లోపతితో పాటు ఆక్యుపంక్చర్, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, యునాని, సిద్ద వంటి తదితర రంగాల్లో సేవలందిస్తున్న పలువురు వైద్యులకు ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ నేతృత్వంలోని పబ్లిక్ కేర్ కౌన్సిల్ సామాన్య ప్రజానీకంలో ఆరోగ్యపట్ల ప్రపంచ ఆరోగయ సంస్థ లక్షాల మేరకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అంతకు ముందు అవార్డు గ్రహీత కాపర్తి జనార్ధన్ మాట్లాడుతూ తన వృత్తి జర్నలిజమని, ప్రవృత్తి ఆక్యుపంక్చర్ అని తెలిపారు. గడిచినా 5ఏళ్లుగా ఆక్యుపంక్చర్ థెరపీలో సేవలను అందిస్తున్నన్నారు.