Friday, January 10, 2025

హరితహారంలో నిజామాబాద్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: హరితహారం నిర్వహణంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ నగరానికి మొదటిస్థానం సాధించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు కెటిఆర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపడుతున్న హరితహారంతో నిజామాబాద్ నగరంలో పచ్చదనంతో కళకళలాడుతోందన్నారు. ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరితహారం నిర్వహణలో మంత్రిచే అవార్డులు అందుకున్న సందర్భంగా నగర సిఐ వెంకట నారాయణ, విజయ్‌బాబు, ఎస్‌ఐ పూరేశ్వర్‌లను అభినందించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పుస్తకాలు, పెన్నులు అందించి సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News