Monday, December 23, 2024

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

- Advertisement -
- Advertisement -

సర్వేలో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి గుర్తింపు లభించిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 400 విమానాశ్రయాల్లో 2023 సంవత్సరానికి ఆసియా -పసిఫిక్ ప్రాంతంలో ‘సంవత్సరానికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల (ఎంపిపిఎ)లో ఉత్తమ విమానాశ్రయం’గా హైదరాబాద్ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఎఎస్క్యూ) అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంపై జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. తమ విమానాశ్రయం నుండి వెళ్లే ప్రయాణికుల సంతృప్తి, అనుభవాన్ని తెలిపే ఈ గుర్తింపు తమకు గర్వకారణమని అన్నారు. తాము నిరంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు.

ఉద్యోగులు, విమానాశ్రయ భాగస్వాములందరికీ వారి అంకితభావం, అవిశ్రాంత కృషి, నిబద్ధతకు తాము ఈ గుర్తింపునకు రుణపడి ఉంటామని అన్నారు. ఎసిఐ వరల్డ్ డైరెక్టర్ లూయిస్ ఫలిప్ డిఒలివేరా మాట్లాడుతూ..ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఎఎస్‌క్యూ) అవార్డ్స్ అనేది ప్రయాణికులే స్వయంగా ఎంపిక చేసుకున్న ఎయిర్ పోర్ట్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఎక్సలెన్స్‌కు ప్రత్యేకమైన విజయమని అన్నారు. ఈ ప్రత్యేకతను గుర్తించి తమను వేరు చేస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభినందనలు తెలిపారు. 2023లో సేకరించిన 5,95,000 సర్వేలలో, ప్రపంచవ్యాప్తంగా 90 విమానాశ్రయాలు 170 ఎఎస్క్యూ అవార్డులను గెలుచుకున్నాయని తెలిపారు. ఈ విమానాశ్రయం వరుసగా తొమ్మిది సంవత్సరాలు (2009 నుండి 2017 వరకు) టాప్ 3 గ్లోబల్ విమానాశ్రయాలలో తన స్థానాన్ని ప్రముఖంగా పొందిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News