Friday, December 20, 2024

స్టూడెంట్ ఒలింపిక్ క్రీడలలో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు సన్మానం

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్:నియోజకవర్గంలోని హోతికేలోగల TRS WRJC(G) రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న బాలికలు శ్రీలంక కొలంబియాలో జరిగిన స్టూడెంట్ ఒలంపిక్స్ ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఇండియా తరపున వాలీబాల్ విభాగంలో థాయిలాండ్‌తో పోటీపడి 3వ స్థానంలో నిలిచారు. ఒలింపిక్ క్రీడలలో భారత తరపున ఆడి విజేతలుగా నిలిచిన మన నియోజకవర్గ విద్యార్థులను శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విద్యార్థినులను, కోచ్‌ను శాలువ, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినిలు ఒలింపిక్ క్రీడలలో ఆడటానికి శిక్షణ ఇచ్చిన కోచ్ దీప గారిని అభినందించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో రెసిడెన్షియల్ స్కూల్‌లు, కాలేజీలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడలలో కూడా రాణించే విధంగా చేస్తున్నామన్నారు. ఇలానే మున్ముందు అన్ని క్రీడలలో మన నియోజకవర్గ విద్యార్థులు పాల్గొని విజయం సాదించేందుకు ఎల్లవేళలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ దీప, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, ఇప్పేపల్లి పీఏసీఎస్ చైర్మన్ దాసరి మచ్చందర్, మాజీ కౌన్సిలర్ బండి మోహన్, సర్పంచ్‌లు విజయ్, సంజీవ్, నాయకులు లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News