Thursday, January 23, 2025

అవార్డులు మరింత ప్రోత్సాహాన్నిస్తాయి : బిగాల

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: ఏ రంగంలోనైనా ఏ సంస్థలైనా, ఎవరైనా గుర్తించి అవార్డులు, రివార్డు లు అందిస్తే వారితో పాటు వారిని ఆదర్శంగా తీసుకొని పని చేస్తున్న వారందరికీ మరింత ప్రోత్సహాన్ని ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. వైశ్య లైమ్‌లైట్- 2023 అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫిలింనగర్ జేఈఆర్‌సీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల వేడక ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది. వైశ్య కమ్యూనిటీ నుంచి వివిధ రంగాల్లో ఉత్తములను గుర్తించి వారికి అవార్డులను అందజేశారు. వ్యాపారవేత్తలను, సామాజిక వేత్తలను, సైంటిస్ట్‌లను వి విధ విభాగాలకు చెందిన ఎందరో వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించేందుకు తాము ఈ అవార్డులు అందజేస్తున్నట్లు ఫౌండర్ ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా 16 విభాగాల్లోని వ్యక్తులకు తాము ఈ అవార్డులు అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వైశ్య లైమ్ టైట్-2023 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును పద్మశ్రీ డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా అందుకున్నారు. డాక్టర్ ఆఫ్ ద ఇయర్ కేటగిరిలో ఈఎన్‌టీ వైద్యుడు మేఘనాథ్ అందుకున్నారు. మోస్ట్ పాపులర్ వైశ్య మెన్ కేటగిరిలో రాచకొండ నాగేశ్వర్‌రావు అవార్డు అందుకున్నారు. అనంతరం కళామందిర్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, దర్శకుడు ఎస్‌వి. కృష్ణారెడ్డి, వాసవి గ్రూప్స్ వ్యవస్థాపకులు యర్రంశెట్టి విజయ్‌కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె. దామోదర్ గుప్తా, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News