Thursday, January 23, 2025

మీసేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల అందజేత

- Advertisement -
- Advertisement -

మెదక్: మీసేవా రంగంలో అత్యధిక లావాదేవీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మందికి అదనపు కలెక్టర్ రమేష్ అవార్డులను అందజేశారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐటి రంగంలో వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మందిని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కార్యాలయం ఎంపిక చేసి జాబితా పంపిందని ఆయన అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాలో 66 మీ సేవా కేంద్రాలకు గాను అత్యధిక లావాదేవీలు, ఆధార్ నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేట్ మీ సేవా కేంద్రం విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్‌లకు అవార్డులు వరించాయని అన్నారు. అవార్డులు అందుకున్న వారిలో మెదక్‌కు చెందిన సుమలత, నరేష్, రాజు, చేగుంటకు చెందిన సాయిబాబా, చిన్నశంకరంపేటకు చెందిన రంజిత్‌కుమార్, రాధిక, నర్సాపూర్ చెందిన విజయ్‌కుమార్‌లతోపాటు టిఎస్‌టిఎస్‌ఎస్ జిల్లా మేనేజర్ శశికాంత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ హరిదీప్‌సింగ్, విఎల్‌ఈలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News