Monday, December 23, 2024

ఉత్తమ ప్రధానోపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి విద్యా దినోత్సవ వేడుకల సందర్భంగా దమ్మపేట మండలం నుండి పలువురు హెడ్‌మాస్టర్లు బెస్ట్ హెచ్‌ఎం అవార్డులు అందుకున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో బుధవారం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా గండుగులపల్లి జట్పీహెచ్‌ఎస్ హెడ్ మాస్టర్ కె. లక్ష్మి, జట్పిహెచ్‌ఎస్ పట్వారిగూడెం హెడ్ మాస్టర్ పి. జగపతి, జట్పిహెచ్‌ఎస్ నాగుపల్లి హెడ్‌మాస్టర్ ఎల్. శ్రీనివాసరావు, జట్పిహెచ్‌ఎస్ మల్కారం హెచ్‌ఎం కె. రామారావులు ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డులు అందుకున్నారు.

వీరితో పాటు జిల్లా స్థాయిలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళాలో ఈవిఎస్ సబ్జెక్ట్‌లో మొదటి బహుమతి ఎంపి యూపిఎస్ రాచూరిపల్లి పాఠశాలకు దక్కింది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటిగా చాలా చక్కగా జగ్గారం పాఠశాలో పనులు పూర్తి చేసినందుకు బెస్ట్ ఎస్‌ఎంసి చైర్మన్‌గా ఎస్. జోగారావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని మండల ఎంఈఓతో పాటు ప్రముఖులు తదితరులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News