Monday, December 23, 2024

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సమయం

- Advertisement -
- Advertisement -

స్వచ్ఛ భారత్ మిషన్‌లో రాష్ట్రానికి అవార్డుల
పంటపై ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, ‘స్వచ్ఛ భారత్ సర్వేక్షణ‘లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతి ని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం కెసిఆర్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు విభాగాల్లో తెలంగాణ 13 అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు దోహదం చేసిన ’పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపిటిసిలను, గ్రామ కార్యదర్శులను ఈ సందర్భంగా కెసిఆర్ అభినందించారు. అప్రతిహత ప్రగతి తో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భమన్నారు. ఇదే పరంపరను కొనసాగిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News