Monday, January 20, 2025

18, 19 తేదీల్లో గ్రూప్స్ పరీక్షలపై అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ కె. గంగా కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని తమ స్టడీ సర్కిల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రూప్స్ కోచింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి , రమేష్ నాయుడు, పాషా, సైదులు లతో అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉచిత అవగాహన, డెమో క్లాసులకు హాజరుకవాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ 6302166077, 9848798654 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News