Wednesday, January 22, 2025

కేంద్ర ప్రభుత్వ విజయాలపై అవగాహన

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా జమ్ము కాశ్వీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి భూపాలపల్లి పట్టణంలోని వ్యాపార, ఉపాధ్యాయ, డాక్టర్, కార్మిక, మీడియా వర్గాలకు చెందిన ప్రముఖులను కలిసి వారికి నరేంద్ర మోడి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో అన్న వర్గాల సంక్షేమానికి దేశ అభివృద్ధికి,రక్షణకు చేసిన కృషిని, సాధించిన విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి, పార్లమెంట్ కో-_కన్వీనర్ చాడ రఘునాథ్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ మోరె రవీందర్‌రెడ్డి, భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్‌రెడ్డి, జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు దొంగల రాజేందర్, అర్బన్ ఉపాధ్యక్షులు తోట ఓదెలు, కోరే సుధాకర్, పడగంటి పురుషోత్తం, కర్ర జైపాల్‌రెడ్డి, రేగళ్ల రవీందర్, రేగురి సురేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News