Sunday, January 19, 2025

బ్యాంకింగ్ మోసాలపై అవగాహన

- Advertisement -
- Advertisement -

 

దహెగాం: కుమురం భీం ఆసిఫాబాద్ దహెగాం మండలంలోని కొత్మీర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాస్పల్లి శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు బ్యాంక్ పెరిట జరిగే మోసాలపై అవగాహన కల్పిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ సాయి చరణ్ తెలిపారు. బ్యాంక్‌ల పేరిట జరుగుతున్న వివిధ మోసాలను అరికట్టడమే ఈ అవగాహన సదస్సు ముఖ్య లక్షంగా మేనేజర్ తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేనేజర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటేడ్ అంబుడ్స్‌మేన్ స్కీం 2021, అంతర్గత ఫిర్యాదుల పరిష్కారం, సురక్షిత బ్యాంకింగ్ పద్దతులు తదితర అంశాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. బ్యాంక్‌ల పనితీరు, ఖాతాదారుల సమస్యల పరిష్కారంపై ఫిర్యాదు చేయవలసిన ఫోన్ నంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్లు గ్రామస్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాస్పల్లి బ్యాంక్ ఫీల్డ్ అధికారి జగదీష్, సిఎస్‌పి సత్యనారాయణ, ఖాతాదారులు, గ్రామస్థులు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News