Monday, December 23, 2024

క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -
- Advertisement -

ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఎడపల్లి మండల వైద్య సిబ్బందిచే విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. తంబాకు, గుట్కా, అల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇవి తీసుకోవడం మానివేయాలని, రోజు పౌష్టికాహారం, పండ్లు తీసుకుంటూ యోగ, మెడిటేషన్, వ్యాయామం చేయాలని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు, వైద్యసిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News