హైదరాబాద్: నగరంలో దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులపై రోగులకు, వారి సహాయకులకు వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేకమైన వర్క్‌షాప్‌ను ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి నిర్వహించింది. నర్సింగ్ సిబ్బంది ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సంబంధించిన పలు అంశాలను వివరించడమే కాకుండా అత్యవసర పరిస్దితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు వైద్యులు వివరించారు. ఈసందర్భంగా వర్క్‌షాపుకు హాజరైన డా. సుధాకర్ మాట్లాడుతూ దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులతో బాధపడే వారి సహాయకులకు ఈవ్యాధుల పట్ల పూర్తి స్దాయి అవగాహన ఉండటం ఎంతో అవసరమన్నారు. ఇలా అవగాహన ఉండటంతో రోగులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటు ముఖ్యంగా అత్యవసర పరిస్దితుల్లో అవగాహన ఉన్న వారు రోగుల ప్రాణాలు కాపాడంలో కీలక పాత్ర పోషించవచ్చని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వైద్యులు సి. ఉమాదేవి, డా. చంద్రశేఖర్, నిథిన్ ఆంటోనితో పాటు పలువురు సిబ్బంది, రోగులు కుటుంబీకులు పాల్గొన్నారు.
మూత్రపిండాల వ్యాధులపై రోగులకు అవగాహన ఉండాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -