- Advertisement -
హైదరాబాద్: సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హిందీ మహావిద్యాలయ డిగ్రీ, పిజి విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో 300మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇటీవల చోటుచేసుకుంటున్న సైబర్ నేరాలు పెట్టుబడుల మోసాలు, ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలు తదితరాల గురించి విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తమ చుట్టుపక్కల వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ బోస్ కిరణ్ తీర్చారు.
- Advertisement -