మన తెలంగాణ/పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని హస్నాపూర్ గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పోలీస్ సిబ్బంది బుచ్చయ్య తదితరులు మాట్లాడుతూ సెల్‌ఫోన్లకు బహుమతులు వచ్చాయి, ఒటిపి వివరాలు చెప్పాలని ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎలాంటి వివరాలను కూడా ఎవ్వరికి షేర్ చేయవద్దన్నారు. గ్రామాల్లో అనుమానితులు ఎవరైనా కనిపిస్తే సమాచారం అందించాలన్నారు. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని, ఎవ్వరు ఎవ్వరికి ఊరికే డబ్బులు, బహుమతులు ఇవ్వరని గుర్తుంచుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, సిసి కెమెరాల ఏర్పాటు, తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులున్నారు.