Friday, December 20, 2024

రాజకీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: సైద్దాంతిక పునాదులపై నిర్మించ ఏర్పడ్డ సీపీఐ సిద్దాంతాన్ని, మారుతున్న రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని సుశిక్షుతులైన కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా తయారవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో జరుగుతున్న కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల సీపీఐ రాజకీయ శిక్షణ శిబిరాల ముగింపుకు ముఖ్య అతిథిగా సాంబశివరావు హాజరై మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రానికి పూర్వం 1925లో డిసెంబర్ 26న దోపిడీ లేని, అంతరాలు లేని, సమసమాజ స్థాపనే లక్షంగా, ఆచరణాత్మక, ఆలోచనా విధానాలతో సైద్దాంతిక పునాదులపై ఆవిర్భవించిన పార్టీ సీపీఐ అని ఇలాంటి పార్టీలో పని చేసే కార్యకర్తలు, నాయకులు అన్ని రంగాల్లో, విషయాల్లో క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని అందుకు సీపీఐ నిర్వహించే రాజకీయ, సైద్దాంతిక శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, వీటిని పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు ఏవైనా ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే కమ్యూనిస్టు పార్టీ శ్రేణులుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సిందేనని, నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి గ్రామాల్లో, వాడల్లో సమస్యలు అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని, పోరాటాలు నిర్వహించడంలో సీపీఐ శ్రేణులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరాల్లో సీపీఐ కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, గుంటి వేణు, తాండ్ర సదానందం, వెన్న సురేష్ పాల్గొన్నారు. శిక్షణా శిబిరానికి నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News