Monday, January 20, 2025

మూఢనమ్మకాలపై అవగాహన

- Advertisement -
- Advertisement -

 

 

కుంటాల : మూడనమ్మకాలపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కుంటాలలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఎంపిడివో గడ్డం మోహన్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక పాఠశాల ప్రదానోపాధ్యాయులు గజపల్లి నర్సయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు చెకుముకి పరీక్షలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి జన విజ్ఞాన వేదిక శాస్త్ర ప్రచారంలో ముందుంటు మూఢనమ్మకాలను నిర్మూలించడంలో కృషి చేయడం జరుగుతుందన్నారు.

విద్యార్థులు విజ్ఞానంతో పాటు క్రమశిక్షణ వినయం కలిగి ఉండాలని టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మంచికి ఉపయోగించుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నహీద్ పాషా, గంగాధర్, భోజన్న, లక్ష్మీ సాహెబ్ రావు, రావుల గంగన్న, దుర్గా నరేందర్, జహీరుద్దీన్, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News