- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈవిఎంల ద్వారా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని జిల్లా, నియోజవర్గ, మండల కేంద్రాల్లో ప్రత్యేక వాహనాల్లో, కూడళ్లల్లో ఈవిఎం, బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ ఏర్పాటు చేసి ఓటు ఎలా వేయాలో రెవెన్యూ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఓటు పడినట్లుగా ఏ విధంగా తెలుస్తుందో వివరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల ప్రధాన కూడళ్లలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
- Advertisement -