Friday, November 22, 2024

చిరుధాన్యాల ఆహారంపై సిడిపిఒ అవగాహన

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/కుమ్రంబీమ్ ఆసిఫాబాద్: లింగాపూర్ మండలంలోని మోతిపటార్ గ్రామంలో శుక్రవారం చిరుధాన్యాల ఆహారంపై సిడిపిఒ ఇందిరమ్మ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాగి, సజ్జ, కోర్ర తదితర ధాన్యాల పంటలను తయారు చేసి వాటి పోషక విలువల గురించి వివరించారు. పలు ధాన్యాల రుచులను స్వయంగా చూపించారు. చిరుధాన్యాలు ఇంట్లో ఆహారంగా వాడాలని వాటి ద్వారా ఐరన్, జింక్ మంచి ప్రోటిన్స్ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మను, ఉప సర్పంచ్ ప్రీతి అమర్‌సింగ్, పంచాయితీ కార్యదర్శి చవాన్ శ్రీనివాస్, దత్తరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News