Monday, December 23, 2024

పర్సుతో సైబర్ టోఫ్రీ నంబర్‌పై అవేర్‌నెస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీనంబర్ 1930పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టిఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ చేపట్టారు. అచ్చం మినీ పర్సులాగే ఉండే దానిపై 500 రూపాయల నోటున్నట్లు ముద్రించారు. దానిని జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్డుపై వేస్తున్నారు. డబ్బులు కావచ్చన వాటిని తీసుకుని చూసిన వారికి ఓపెన్ చేయగానే సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు వెంటనే 1930కు ఫోన్ చేయాలని సందేశాన్ని ముద్రించారు. పర్సు కావచ్చని తీసుకున్న చాలామంది అందులో ఉన్న సందేశాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News