Monday, December 23, 2024

అత్యాధునిక చికిత్సలు వచ్చినా వేధిస్తున్న కిడ్నీ సమస్యలు…

- Advertisement -
- Advertisement -

Awareness on Kidney problems

జీవన విధానంలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ వాటడం కిడ్నీపై ప్రభావం
ప్రజలకు కిడ్నీ హెల్త్ పేరిట వైద్య నిపుణులు అవగాహన కల్పించాలి
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా పలు సూచనలు చేస్తున్న వైద్యులు

హైదరాబాద్ : మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేసేవి కిడ్నీలు. ఇవి రోజుకు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ది చేస్తాయి. వాటి పనితీరు ఆధారంగా మిగతా శరీర భాగాలు సమతుల్యం చెంది సమర్దవంతంగా పనిచేసి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుతకాలంలో అత్యాధునిక వైద్య పద్దతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగించే దీర్ఘకాల వ్యాధుల జాబితాలో కిడ్నీ సమస్య ఒకటి ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోందని రెనోవా ఆసుపత్రి వైద్యులు డా.అర్చనా దప్తార్దార్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా…. ప్రధానంగా జీవన విధానంలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాటటం, హై బీపీ, షుగర్, గాలి,నీటి కాలుష్యం ప్రధానమైనవి. అదే విధంగా శరీరంలో వేరే అవయవాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కూడా ఈప్రభావం కిడ్నీ మీద పడి వైఫల్యానికి కూడా దారి తీస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో 2.4 మిలియన్ల మంది చనిపోతున్నట్లు అంచనా. ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు.

రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో 2040 నాటికి ప్రపంచ మరణాలలో ఐదవ స్దానాన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులే ఆక్రమిస్తున్నాయని ఆరోగ్య అధ్యయనాలు పేర్కొంటున్నారు. ఇటీవల సైలెంట్ కిల్లర్‌గా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల అంతర్జాతీయంగా వైద్య విభాగం అప్రమత్తమైన అందరికీ కిడ్నీ హెల్త్ పేరిట ప్రజల్లో అవగాహనకు నడుం బిగించింది. పలు నెప్రాజలీ సొసైటీలు, వరల్డ్ కిడ్నీడే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి రెండో గురువారం కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ః దేశంలో 16శాతం ప్రజలు ఈవ్యాధితో బాధపడుతున్నట్లు, కిడ్నీ వైపల్యం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి, రెండు దశల్లో ఉన్నప్పుడు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తే తప్ప లక్షణాలు కనిపించవు. డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు, గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నవారు. వారసత్వంగా సమస్య ఉన్నవారు ముందుస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు. మూడో దశలో కాళ్లు వాపు, రక్తహీనత, రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువమంది ఈదశ వచ్చే వరకు సమస్యను గుర్తించలేదు. ఈదిశలో నిర్లక్షం చేసినా, గుర్తించకపోయినా నాలుగో దశలో పరిస్దితి తీవ్రమైన కిడ్నీ పనితీరు ఆగిపోయి. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగా మారుతుంది. ఆకలి మందగించడం, ఆయాసం, వాంతులు, ఒంట్లో నీరు చేరడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈదశలో డయాలసిస్ చేయాలి. కిడ్నీ మార్చాలి. లేదంటే సమస్య తీవ్రమైన రోగి మరణించడం జరుగుతుంది. ఈనేపథ్యంలో కిడ్నీ వ్యాధుల లక్షణాలను తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.

వ్యాధి నిర్దారణ ః కిడ్నీ వ్యాధి నిర్దారణ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మూత్ర పరీక్ష గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, రక్త పరీక్ష ద్వారా కిడ్నీ వ్యాధిని గుర్తింవచ్చు. కిడ్నీ వ్యాధులల్లోనూ పలు రకాలు ఉన్నాయి. అన్ని కిడ్నీ వ్యాధులకు డయాలసిస్ అవసరం ఉండదు. రోగులు కూడా ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే ఆహార మార్పులు, మందులు, జీవనశైలి మార్పులతో వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ అవసరం రావచ్చు. ఈవ్యాధి జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుందున్న నెప్రాలజిస్టు సూచనల ప్రకారం ఆహార అలవాట్లను మార్పు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు డా. అర్చనా దప్తార్దార్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News