మనతెలంగాణ/మూడుచింతలపల్లి : పోషకవిలువలపై రైతులు అంచనా వేయాలని వ్యవసాయాధికారి కృష్ణవేణి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో మండలంలోని కేశవరంలో పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సాగు పద్దతిలో పచ్చిరొట్ట ఎరువులు రైతులకు ఎంతగానో లాభసాటిగా మార్చారు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ నాటిన పొలాలు సారవంతంగా అయి పోషక విలువలు అధికంగా లభిస్తాయన్నారు. వరి నారుమడి క్షేత్రస్థాయిలో సందర్శించి పచ్చిరొట్ట ఎరువులు లాభాలు, నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మండలంలో 40 క్వింటాళ్ల జనుము, 25 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు 60 శాతం సబ్సిడిపై ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇవి పొలంలో వేయడంతో పంటలకు 40-60 కిలోల నత్రజనిని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబందు కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
పోషక విలువలపై రైతులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
- Advertisement -