- Advertisement -
అమరావతి: ప్రజల్లో అవయవ దానంపై అవగాహన తీసుకురావాలని ఎపి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుంటూరులోని మెడికల్ కళాశాలలో శుక్రవారం అవయదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో రోజుకు ఐదు బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలియజేశారు. అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని వైద్యులను ఆయన ప్రశంసించారు.
- Advertisement -