Friday, January 17, 2025

బేటి బచావో బేటి పడావోపై అవగాహన

- Advertisement -
- Advertisement -

కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కేజిబివి పాఠశాలలో శనివారం ఐసిడిఎస్ ఆద్వర్యంలో విద్యార్థులకు బేటి బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ సరస్వతి బాల్య వివాహాల పై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు డ్రాయింగ్ కంప్టిషన్ పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతి శృతి 9వ తరగతి, ద్వితీయ బహుమతి ఎసుని 10వ తరగతి, 6వ తరగతి చదువుతున్న సుబంగి తృతీయ బహుమతిని గెలుపొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్‌వో యు.గంగామణి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టిచర్లు యమున, గంగాజమున, దివ్య, బాలమణి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News