Friday, December 20, 2024

రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మద్యం తాగి వాహనాలు నడపడంతో యువకులు రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు అన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపిన వారికి గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఇండియాల ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1,53,947మంది మృతిచెందారని, ప్రపంచంలో ఇండియాలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 20 నుంచి 35 ఏళ్ల లోపు వారే మృతిచెందుతున్నారని తెలిపారు. 90శాతం రోడ్డు ప్రమాదాలు మానవతప్పిదాలు, నిద్రలేమి, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల, పాదచారులు మృతిచెందుతున్నారని తెలిపారు. యువత కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని, మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిసిపిలు శ్రీనివాస్, ఎసిపి ధణలక్ష్మి, 100మంది మద్యం తాగి పట్టుబడిన వారు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News