Wednesday, January 22, 2025

కంటి వెలుగుపై అవగాహన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురించి సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో సర్పంచ్ పల్లె నరేశ్‌గౌడ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అదేశాల మేరకు ఈ నెల 17 నుంచి మార్చి 19 వరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీఓ హరి ప్రసాద్, ఎపిఎం విజయనిర్మల,వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి రవి, సీఎలు , అంగన్‌వాడి టీచర్లు, ఎఎన్‌ఎంలు, నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News