Wednesday, January 22, 2025

మొబైల్ వాహనాల ద్వారా ఓటుపై అవగాహన కల్పించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఓటు హక్కు వినియోగంపై మొబైల్ వాహనాల ద్వారా అవగాహనను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని ప్రతి పోలింగ్ కేంద్రంలోఉన్న సౌకర్యాలను పరిశీలించి పటిష్టమైన నివేదిక సిద్దం చేసి పంపించాలని సూచించారు. ఈవీఎం గోడౌన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పరిశీలించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పీడబ్లు ఓటర్ల సంఖ్య తగ్గిన చోట మరోసారి పరిశీలించాలన్నారు.

ఫారం -6, 7, 8 చర్యలు తీసుకోవాలని, ఫారం -6 జూలై 15తో ముగియనున్నదని, పెండింగ్ దరఖాస్తులపై చర్యలను తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా హౌస్ సైట్ పట్టా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన నికోలస్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News