వికారాబాద్ : ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు గాను ఈనెల 10 నుండి జిల్లాలో ఈవీఎంల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలు డమ్మీ ఓటింగ్ లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఈనెల 10వ తేదీ నుండి అన్ని నియోజకవర్గ కేంద్రాలలోని హెడ్ ఆఫీస్ లలో ఈవీఎం ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసి నియోజకవర్గాల నుండి గ్రామస్థాయి వరకు ఆగస్టు మాసంతం వరకు ప్రజల చేత డమ్మీ ఓటింగ్ చేయించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు గాను నాలుగు మొ బైల్ వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతిరోజు రెండు లొకేషన్ లలో వాహనాలను తిప్పుతూ ప్రజల ద్వా రా డమ్మీ ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. నియోజకవర్గాలలో ఇట్టి ప్రక్రియ నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. జూలై 13 నాటితో ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోతున్నందున అన్ని పనులను వేగ వంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇంటింటి సర్వే అనంతరం చేపట్టాల్సిన డాటా ఎంట్రీ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి సెక్టార్ కు ఒక సెక్టార్ ఆఫీసర్లను ఎంపిక చే యాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యానాయక్ లతో పాటు వికారాబాద్/తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్, అన్ని మండలాల తాసిల్దారులు, సెక్షన్ సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.