న్యూఢిల్లీ: భారత వన్యప్రాణి సంరక్షణ బోర్డు 14న కౌ హగ్ డే సంబరాలు జరుపుకోవాలన్న పిలుపును ఉపసంహరించుకుంది. ఈ నెల ప్రేమికుల దినోత్సవాన్ని కౌ హగ్ డేగా జరుపుకోవాలని పిలుపినిచ్చింది. అయితే దీనిపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌ హగ్ డే పిలుపు ఉపసంహరించుకుంటున్నట్లు ఎడబ్ల్యూబిఐ శుక్రవారం తెలిపింది. కేంద్ర మంత్రి రూపాలా సంరక్షణ బోర్డు వినతికి సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి కౌ హగ్ డేగా జరుపుకోవాలని కోరారు. అయితే మరుసటిరోజే కేంద్రం తిరస్కరించడంతో ఎడబ్ల్యూబిఐ తన పిలుపును ఉపసంహరించురించుకోవడం విశేషం.
ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రపంచవ్యాప్తంగా వ్యాలెంటైన్ డేగా జరుపుకుంటారు. అదేరోజు గోప్రేమికులు ఆవులను హగ్ చేసుకుని తమ ప్రేమను చాటుకోవాలని వన్యప్రాణి సంరక్షణ బోర్డు పిలుపునిచ్చింది. ఈ బోర్డు మత్స, పశుసంవర్థక శాఖ అధీనంలో ఉండగా ఈ శాఖకు పురుషోత్తమ్ రూపాలా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వన్య సంరక్షణ బోర్డు దుత్తా మాట్లాడుతూ కేంద్ర పశుసంవర్థక శాఖ, ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు కౌ హగ్ డే పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డు వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరిచారు. కాగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1962లో వన్యప్రాణి సంరక్షణ బోర్డును 1962లో ఏర్పాటు చేశారు.