Friday, March 14, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం.. అక్షర్‌కే ఆ పోస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఈ లీగ్‌ కోసం ప్రాక్టీస్‌లు ప్రారంభించాయి. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్ బాధ్యతలను తమ కెప్టెన్‌గా ప్రకటించింది. కెఎల్ రాహుల్ కెప్టెన్సీని నిరాకరించడంతో అక్షర్‌కు ఈ అవకాశం దక్కింది.

గత రెండు ఐసిసి టోర్నమెంట్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్ బ్యాటింగ్‌‌లో 235 పరుగులు చేసి.. బౌలింగ్‌లో 11 వికెట్లు తీశాడు. అయితే ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో గౌరవంగా ఉందని అక్షర్ తెలిపాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన జట్టు ఓనర్లకు, సహాయక సిబ్బందికి అతను ధన్యవాదాలు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News