న్యూఢిల్లీ: ఐపిఎల‌్‌లో మరో ఆటగాడికి అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌పై ఈసారి జరిమానా పడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయని కారణంగా అక్షర్‌కు ఐపిఎల్ అడ్వైజరీ కమిటీ రూ.12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్‌రేట్ నమోదు చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ‘అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కొనసాగించినందుకు ఆర్టికల్ 2.22 ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అక్షర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం’ అని అడ్వైజరి కమిటీ ప్రకటనలో తెలిపింది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఢిల్లీ ఆఖర్లో తడబడింది. 19 ఓవర్లలో 193 పరుగుల మాత్రమే చేసి ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.