Friday, November 22, 2024

శ్రీ సిటీ, చిలమథుర్‌లో గ్రామీణ శాఖను ప్రారంభించిన యాక్సిస్‌ బ్యాంక్‌

- Advertisement -
- Advertisement -

దేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఒకటైన యాక్సిస్‌ బ్యాంక్‌ తమ గ్రామీణ బ్యాంక్‌ శాఖను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ, చిలమథుర్‌ వద్ద ప్రారంభించింది. ఈ శాఖను ముఖ్య అతిథులు గా విచ్చేసిన కస్టమ్స్‌ స్పెసిఫైడ్‌ ఆఫీసర్‌ మధు బాబు, సిటీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నాగరాజన్‌, సిటీ బిజినెస్‌ హెడ్‌ రాకేష్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు నూతి చక్రవర్తి, రీజనల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌–సౌత్‌ 2, ఎం హరనాథ్‌, సర్కిల్‌ హెడ్‌, ఆంధ్ర ఎం వెంకట్‌ సుబ్రమణ్యం, క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు, నటువ బ్రమర్‌నాథ్‌, ఎల్‌ ఎస్‌ క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు పాల్గొన్నారు. ఈ నూతన శాఖ గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆర్కెడ్‌ బిల్డింగ్‌, శ్రీ సిటీ ట్రేడ్‌ సెంటర్‌ ఎదురుగా, చిలమథుర్‌, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ఉంది. అన్ని రకాల సాధారణ బ్యాంక్‌ సేవలనూ ఇక్కడ అందించనున్నారు.

ఈ సందర్భంగా యాక్సిస్‌ బ్యాంక్‌ భారత్‌ బ్యాంకింగ్‌ హెడ్‌, గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మునీష్‌ షార్దా మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పట్టణ మార్కెట్‌లు యాక్సిస్‌ బ్యాంక్‌ దృష్టి సారించిన అతి కీలకమైన మార్కెట్‌లు. ఈ నూతన శాఖతో విస్తృత శ్రేణి బ్యాకింగ్‌ సేవలను ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అందించనున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News