విజయవాడ: అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని, భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆరోగ్య శిబిరాలను విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ఎంపిక చేసిన యాక్సిస్‌బ్యాంక్ కేంద్రాల వద్ద నిర్వహించనున్నారు.
ఈ బ్యాంక్ దీని కోసం సుప్రసిద్ధ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, హాస్పిటల్స్ అయిన అపోలో హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, మ్యాక్సివిజన్ హాస్పిటల్స్, శంకర్‌నేత్రాలయ వంటి వాటితో భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా బ్యాంకు ఖాతాదారులు అత్యుత్తమ వైద్య మార్గనిర్ధేశకత్వంను నిపుణులైన డాక్టర్ల నుంచి పొందగలరు. ఈ ఆరోగ్య శిబిరాలలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా డాక్టర్ల కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తారు. ఈ పరీక్షలలో కంటి పరీక్షలు, రక్తపోటు (బీపీ), ర్యాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్‌బీఎస్), ఎలకో్ట్రకార్డియోగ్రామ్ (ఈసీజీ) వంటివి ఉంటాయి.
ఈ ఆరోగ్య శిబిరాలను ఈ దిగువ శాఖలలో నిర్వహించనున్నారు. అవి….
26 ఏప్రిల్ – కాకినాడ డివిజన్‌లో తాడేపల్లి గూడెం శాఖ, రాజమండ్రి డివిజన్‌లో ఏలూరు
మే 03– రాజమండ్రి డివిజన్‌లో ఏలూరు ఒన్, విజయవాడ డివిజన్‌లో చిల్లకల్లు
మే 04– విజయవాడ డివిజన్‌లో తెనాలి శాఖ
మే 05– విజయవాడ డివిజన్‌లో మచిలీపట్నం, విజయవాడ వ్యూహాత్మక శాఖలు
మే 06 – విజయవాడ డివిజన్‌లో గుణదల, నూజివీడు, విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ శాఖలు
ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగుపరచడంతోపాటుగా సమాజానికి వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే యాక్సిస్ బ్యాంక్ లక్ష్యంలో ఈ కార్యక్రమం ఓ భాగం. ఈ ఆరోగ్య శిబిరాలలో రోజుకు 200 మందికి పైగా ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా.