Monday, December 23, 2024

యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.6,071 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిసెంబర్ ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 3.7 శాతం పెరిగి రూ.6,071 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.5,853 కోట్లుగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.12,532 కోట్లతో 2 శాతం పెరిగింది. త్రైమాసిక ప్రతిపాదికన 2 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 4.01 శాతం పెరిగింది. బ్యాంక్ ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) ఆరోగ్యకరంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ 1.73 శాతం నుంచి 1.58 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పిఎ 0.36 శాతం వద్ద నిలకడగా ఉంది.

జెఎస్‌డబ్లు లాభం 28 శాతం జంప్
క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో జెఎస్‌డబ్లు అద్భుతంగా రాణించింది. కంపెనీకి పవర్ డిమాండ్, ఇంధన ధరల తగ్గుదల దోహదం చేశాయి. కంపెనీ నికర లాభం రూ.231 కోట్లతో 28 శాతం పెరిగింది. భారత్ పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్ 16 నెలల గరిష్ఠానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News