Wednesday, January 22, 2025

ఓటీటీలో శివకార్తికేయన్ ‘అయలాన్’

- Advertisement -
- Advertisement -

శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘అయలాన్’ మూవీ ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. రవికుమార్ దర్శకత్వం వహించిన ‘అయలాన్’ తమిళంలో భారీ విజయం అందుకుంది. ఈ మూవీ ఇంకా తెలుగులో రిలీజ్ కాలేదు. త్వరలో తమ ప్లాట్ ఫారంపై ‘అయలాన్’ స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్స్ట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే ఎప్పడు రిలీజ్ అవుతుందో, ఏయే భాషల్లో ఉంటుందో పేర్కొనలేదు. కాగా తెలుగులో ఇక్కడి థియేటర్లలో రిలీజ్ చేశాకే, ఓటీటీలో రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News