అయోధ్య : అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపనకు బాగా ముందుగా నగరంలో తొలి మిమానాశ్రయాన్ని పూర్తి చేసినట్లు, అది విమానాల రాకపోకల కోసం సంసిద్ధంగా ఉందని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) చైర్మన్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. విమానాశ్రయం నిర్మాణాన్ని 20 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. నిరుడు ఏప్రిల్‌లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఒయు ప్రకారం అయోధ్య విమానాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టును ఎఎఐ చేపట్టింది.
అయోధ్య విమానాశ్రయం అభివృద్ధి కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 821 ఎకరాల స్థలాన్ని సమకూర్చినట్లు ప్రభుత్వ ప్రకటన తెఇయజేసింది. అయోధ్య విమానాశ్రయానికి వైమానిక అనుసంధానం ముక్యమని, విమానాశ్రయం విస్తరణ పట్ల ఎఎఐ ఆనందంగా ఉందని సంస్థ చైర్మన్ సంజీవ్ కుమార్ తెలిపారు. విమానాశ్రయాన్ని అయోధ్యలో నిర్మించినట్లు, ఈ నిర్మాణాన్ని ఎఎఐ 20 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు సంజీవ్ కుమార్ తెలియజేశారు.