Thursday, January 23, 2025

అయోధ్యలో ‘ శ్రీసీతారామ్ బ్యాంక్’

- Advertisement -
- Advertisement -

అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఓ ప్రత్యేక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంకుల్లో మాదిరిగా ఇక్కడ డబ్బులు దొరకవు. దానికి బదులు 35 వేలకు పైగా ఉన్న ఈ బ్యాంకు ఖాతాదారులకు మనశ్శాంతి, మత విశ్వాసం, ఆధ్యాత్మికత లభిస్తాయి. నూతనంగా నిర్మించిర రామమందిరాన్ని దరఙ్వంచే భక్తులు, సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యాంకు పేరు ‘ అంతర్జాతీయ శ్రీ సీతారామ్ బ్యాంక్’. ఇక్కడ డిపాజిట్ చేసేది అన్ని పేజీల్లో ‘సీతారాం’అని రాసి ఉన్న పుస్తకాలు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ 1970 నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకులో ఇప్పుడు 35 వేలకు పైగా ఖాతాదారులున్నారు. మన దేశానికి చెందిన వారే కాకుండా అమెరికా, బ్రిటన్, కెనడా, నేపాల్, ఫిజి, యుఎఇ తదితర దేశాలకు చెందిన వారు కూడా ఈ ఖాతాదారుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రామభక్తులనుంచి సేకరించిన 20,000 కోట్లసార్లు ‘సీతారాం’అని రాసి ఉన్నబుక్‌లెట్స్ ఉన్నాయి.

నూతన రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత బ్యాంకును సందర్శించే వారి సంఖ్య పెరిగిందని బ్యాంక్ మేనేజర్ పునీత్ రామ్‌దాస్ మహరాజ్ అంటున్నారు. తర్వాత బ్యాంకు ప్రతిఒక్కరికీ ఉచితంగా బుక్‌లెట్స్, రెడ్‌పెన్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి అకౌంట్‌పై కన్నేసి ఉంచుతుంది. ‘అకౌంట్ తెరవాలంటే ఒక వ్యక్తి కనీసం 5లక్షల సార్లు ‘సీతారాం’అని రాయాలి. అప్పుడు పాస్‌బుక్ జారీ చేస్తాం. దేశవ్యాప్తంగా, చివరికి విదేశాల్లో బ్యాంకు శాఖలు 136 ఉన్నాయి. ఖాతాదారులు బుక్‌లెట్స్‌నుపోస్టుద్వారా కూడా పంపొచ్చు. అందుకోసం మేము ఇక్కడ ఓ లెడ్జర్‌ను కూడా మెయింటైన్ చేస్తున్నాం’ అని పునీత్ రామ్ దాస్ పిటిఐకి చెప్పారు. సీతారాం అని రాసి బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏమిటని సందర్శకులు అడుగుతుంటారని ఆయన చెప్పారు.‘ మనశ్శాంతి, విశ్వాసం, ధర్మం కోసం మనం దేవీ దేవతల ఆలయాలను ఎలా సందర్శిస్తామో ఇది కూడా ఓ భక్తి మార్గమని నేను వాళ్లకు చెబుతుంటాను.ప్రతి ఒక్కరి మంచి కార్యాలు, చెడు కార్యాల లెక్కలు భగవంతుడి వద్ద ఉంటాయని మనం చెప్పడం లేదా,

ఇది కూడా ఒక విధంగా అలాంటిదే’నని పునీత్ రాందాస్ చెప్పారు. శ్రీరాముడి పేరు రాయడం, స్మరించడం,నెమరు వేసుకోవడం వల్ల ఎంతో ఊరట,గాఢమైన ఆధ్యాత్మిక సుసంపన్నత లభిస్తుందని భక్తులవిశ్వాసం అని ఆయన చెప్పారు. అంతేకాదు 84 లక్షల సార్లు రాముడి పేరు రాయడం వల్ల మోక్షప్రాప్తి పొందుతారని కూడా భక్తుల విశ్వామని ఆయన చెప్పారు. తాను గత 14 ఏళ్లుగా ఈ బ్యాంక్‌ను సందర్శిస్తున్నానని బీహార్‌లోని గయకు చెందిన జీతూ నాగర్ అనే భక్తుడు చెప్పారు. తాను ఇప్పటికే 1.37 కోట్లసార్లు రాముడి పేరుతో ఉన్న బుక్‌లెట్స్‌ను బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈయనే కాదు, ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. తమకు ఏదయినా సమస్య వచ్చినప్పుడు ఇలా శ్రీరాముడి నామం రాయడం వల్ల తమకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని, ఆ కష్టం దూరమయిన భావన కలుగుతుందని వాళ్లుంతా చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News