Monday, January 20, 2025

అయోధ్య రామయ్యకు భలే కానుక!

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి భక్తులు చిత్రవిచిత్రమైన కానుకలు సమర్పించి, తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు. తాజాగా ఓ  భక్తబృందం భారీ ఢమరుకాన్ని రామయ్యకు కానుకగా అందజేసింది. దీని బరువు 1100 కిలోలు. అరు అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఢమరుకాన్ని మోగిస్తే, కొన్ని కిలోమీటర్ల వరకూ శబ్దం వినిపిస్తుందట. ఇప్పటికే ఇది గిన్నెస్ బుక్ లోకి ఎక్కడం విశేషం. మధ్యప్రదేశ్ కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం ఈ ఢమరుకాన్ని బుధవారంనాడు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News