అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు… రేపటినుంచి భక్తులకు దర్శనం
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
అయోధ్య ఆలయ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ
అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ఠ క్రతువు.. స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య ఆలయంపై హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం
పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద రామభక్తులు హల్ చల్ చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్నారు. మరికొందరు రాముడి జెండాలతోపాటు జాతీయ పతాకాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం 12:29:03 నుంచి 12:30:35 వరకు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత 1.15 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని
అయోధ్యకు చేరుకున్న సచిన్ టెండూల్కర్
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 70 దేశాల్లో లైవ్ లో వీక్షిస్తున్న భక్తులు
అయోధ్యకు చేరుకున్న రజనీకాంత్
అయోధ్యకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్
అయోధ్య రామాలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
మోదీ చేతుల మీదుగా కాసేపట్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
అయోధ్య చేరుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్